గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 5 సెప్టెంబరు 2022 (20:33 IST)

శబ్దం లేని, ధూళి రహిత, పొగలేని చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Chetak
హైదరాబాద్‌లో చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు ఎక్స్‌క్లూజివ్‌ డీలర్‌ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్‌, రెండు నూతన చేతక్‌ వర్క్‌షాప్‌లను ప్రత్యేకంగా బేగంపేట మరియు కాచిగూడాలలో  చేతక్‌ వినియోగదారుల కోసం నేడు ప్రారంభించింది. సిద్ధి వినాయక ఆటోమొబైల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ బాబుల్‌ రెడ్డి  నేడు కాచిగూడా, బేగంపేటలలో ఈ రెండు ప్రత్యేక సర్వీస్‌ సెంటర్లను శ్రీ వృద్ధి జీత్‌ బందోపాధ్యాయ్‌ (చేతక్‌  నేషనల్‌  సేల్స్‌ హెడ్‌) మరియు శ్రీ శివకుమార్‌ (చేతక్‌ నేషనల్‌ సేల్స్‌ హెడ్‌)తో కలిసి ప్రారంభించారు.

 
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తమ చేతక్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన సేవా కేంద్రాలను ప్రారంభించడం పట్ల శ్రీ బాబుల్‌ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్‌ షెడ్యూల్‌, సంవత్సరానికి ఓమారు మాత్రమే ఉన్నప్పటికీ, తమ వినియోగదారులకు అత్యుత్తమ శ్రేణి సేవా సదుపాయం అందించాల్సిన ఆవశ్యకత ఉందని బాబుల్‌ భావిస్తున్నారు.


చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల వర్క్‌షాప్‌లను నేడు ప్రారంభించడమన్నది తమ వినియోగదారులకు ప్రీమియం అనుభవాలను అందించే రీతిలో అత్యుత్తమ శ్రేణి మౌలిక సదుపాయాలను అందించడంలో భాగం. ఎలాంటి ఆయిల్‌ మార్క్స్‌, డస్ట్‌, స్మోక్‌ లేదా శబ్దాలు చేతక్‌ వర్క్‌షాప్‌ల వద్ద ఉండవు. ఈ సేవా కేంద్రాలను సందర్శించిన వినియోగదారులు పూర్తి విభిన్నమైన అనుభూతులను పొందగలరన్నారన్న శ్రీ బాబుల్‌ రెడ్డి మాట్లాడతూ మరో మూడు నెలల్లో కూకట్‌పల్లి వద్ద మరో వర్క్‌షాప్‌ను ప్రారంభించనున్నామన్నారు. ఇది సౌకర్యవంతమైన సేవలను హైదరాబాద్‌ నగరంలోని చేతక్‌ వినియోగదారులకు అందించనుందన్నారు.

 
కొంతమంది వినియోగదారులు సైతం ఒక సంవత్సరం పాటు చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాలను సవారీ చేసిన అనుభవాలను పంచుకున్నారు. చేతక్‌ కేవలం పర్యావరణ అనుకూల వాహనం మాత్రమే కాదు పాకెట్‌ ఫ్రెండ్లీ వాహనంగా తమ సంతోషాన్ని వారు వ్యక్త పరిచారు. చేతక్‌ వాహనాలను సొంతం చేసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన వినియోగదారులు ప్రత్యేకంగా సేవా కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల తమ అవసరాలు కూడా పూర్తిగా తీరతాయనే సంపూర్ణ విశ్వాసం కలుగుతుందన్నారు. బజాజ్‌ చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను పూర్తి లోహపు బాడీతో  తీర్చిదిద్దారు. ఇది కంపాక్ట్‌ చార్జర్‌ను కలిగి ఉంటుంది. 

 
ఎక్కడైనా సరే దీనిని చార్జ్‌ చేయవచ్చు. వీటితో పాటుగా అత్యున్నత శ్రేణి ప్రీమియం ఫీచర్లను సైతం ఇది కలిగి ఉండటం వల్ల వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి  ఆసక్తి చూపుతున్నారు. బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ తయారుచేసింది. ఆటోమొబైల్స్‌ తయారీలో 75 సంవత్సరాలకు పైగా అనుభవం బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సొంతం. హైదరాబాద్‌లో ప్రత్యేక సేవా కేంద్రాల ద్వారా వినియోగదారులు పూర్తి ఆత్మవిశ్వాసం ప్రదర్శించడంతో పాటుగా ఇతర విద్యుత్‌ వాహనాలతో పోలిస్తే చేతక్‌ తమ తొలి ప్రాధాన్యతగా చెబుతున్నారు.

 
శ్రీ బాబుల్‌ రెడ్డి మాట్లాడుతూ చేతక్‌ వినియోగదారులందరూ తమ పూర్తి సరికొత్త సేవా కేంద్రాలను సందర్శించడంతో పాటుగా శబ్ద రహిత, పొగ రహిత వర్క్‌షాప్‌ల అనుభవాలను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అంతేకాదు, చేతక్‌ కొనుగోలు చేయాలని భావిస్తోన్న వినియోగదారులు అమ్మకం తరువాత సేవల అనుభవాలకు భరోసా అందిస్తున్నారు.