శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (18:20 IST)

పెళ్లైన నెలకే గల్ఫ్ వెళ్లిన భర్త: మూడేళ్ల తర్వాత తిరిగొస్తే భార్య 4 నెలల గర్భిణి

కొత్తగా పెళ్ళయ్యింది. అయితే పుట్టింటి వారు ఇచ్చిన డబ్బులతో బతకడం కష్టమనుకున్నాడు. భార్యను కష్టపెట్టడం ఏమాత్రం ఇష్టం లేని భర్త గల్ఫ్‌కు వెళ్ళాడు. పెళ్ళయి నెలకే గల్ప్‌‌కు వెళ్ళి మూడు సంవత్సరాల పాటు అక్కడే వుండి బాగా సంపాదించాడు. ఎంతో ఆశతో వారం క్రితమే తిరిగి స్వగ్రామానికి వస్తే భార్య నాలుగు నెలల గర్భిణి అని తెలుసుకుని షాకయ్యాడు.
 
నిజామాబాద్ పట్టణానికి చెందిన సుదర్సన్‌కు, అదే ప్రాంతానికి చెందిన మంజులకు మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్న సుదర్సన్‌కు మంజులను ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లయిన తరువాత భార్య ఏవిధంగాను కష్టపడకూడదనుకున్నాడు.
 
శోభనాన్ని వాయిదా వేసుకుని మరీ పెళ్ళయిన నెల రోజుల్లోనే గల్ఫ్‌కు వెళ్ళాడు. అక్కడ మూడేళ్ల పాటు ఉన్నాడు. తన తండ్రి చనిపోవడంతో అమ్మ దగ్గర భార్యను వదిలివెళ్ళాడు. వయోవృద్ధురాలు కావడంతో ఆమె ఇంటి పట్టునే ఉండేది. అయితే ఇదే అదునుగా చూసిన ఇంటి పక్కన ఉన్న సుమన్ అనే వ్యక్తి మంజులను మాయమాటలు చెప్పాడు.
 
నీ భర్త గల్ఫ్‌లో ఉన్నాడు. ఇంకెప్పుడు వస్తాడు. నీకు పెళ్ళయ్యింది కానీ శోభనం కాలేదుగా అంటూ మెల్లగా మాటల్లో దింపుతూ ఆమెను లొంగదీసుకున్నాడు. తన ఇంటి పక్కనే ఉండటంతో మిద్దె పైకి ఆమెను తీసుకెళ్ళి శృంగారం చేసేవాడు. ఇలా ఆమెతో సుమారు ఏడు నెలల పాటు అక్రమ సంబంధం సాగిస్తున్నాడు.
 
ఎవరికీ అనుమానం రాకుండా మంజుల కూడా సుమన్‌తో కలిసేది. అయితే సరిగ్గా వారం రోజుల క్రితం గల్ఫ్ నుంచి తిరిగి నిజామాబాద్‌కు వచ్చాడు సుదర్సన్. ఎంతో ఆనందంగా తను సంపాదించిన డబ్బును భార్యకు చూపించాడు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేవని.. హాయిగా ఉందామని అన్నాడు.
 
అయితే అతని ఆనందం కేవలం మూడు రోజుల్లోనే ఆవిరైంది. భార్యకు ఉన్నట్లుండి కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. వైద్యులు ఆమెను చెక్ చేసి నాలుగు నెలల గర్భిణి అని చెప్పారు. దీంతో షాకయ్యాడు సుదర్సన్. భార్యను నిలదీశాడు. జరిగిన విషయాన్ని భర్తకు చెప్పేసింది మంజుల. దీంతో పంచాయతీ పెట్టాడు. భార్యను ఇంట్లో నుంచి తరిమేశాడు. సుమన్‌తో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో పోలీసుల వరకూ వెళ్లింది.