సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (13:18 IST)

మూడేళ్ల బాలుడికి హెచ్.ఐ.వి.. బ్లడ్‌ బ్యాంకుపై కేసు

హైదరాబాద్ నగరంలో తలసేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చిన మూడేళ్ల బాలుడు హెచ్.ఐ.వి వైరస్ సోకింది. ఈ కేసులో రక్తదానం చేసిన బ్లండ్‌బ్యాంకు‌పై కేసు నమోదైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లి అనే గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు గత ఏడు నెలలుగా తలసేమియాతో బాధపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాలుడికి రక్తమార్పిడి చికిత్స కోసం తండ్రి విద్యానగరులోని బ్లండ్ బ్యాంకు నిర్వాహకులను స్పందించారు. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ బాలుడికి రక్తమార్పడి చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీన రక్తమార్పిడి కోసం బాలుడిని తీసుకుని తల్లిదండ్రులు బ్లండ్ బ్యాంకుకు వచ్చారు. అక్కడ ఆ బాలుడికి నిర్వహించిన పారామెడికల్ పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్టు నిర్ధారణ అయిందని నల్లకుంట పోలీసులు వివరించారు. 
 
ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపిన పరీక్షల్లో ఎపుడు కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్‌గా రాలేదు. కానీ, తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో పోలీసులు బ్లడ్ బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.