సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (11:12 IST)

"నన్నే అద్దె అడుగుతావే.." ఇంటి ఓనర్‌ను కొట్టిన తెరాస ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ తెరాసకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు తన జులుం ప్రదర్శించారు. ఇంటి అద్దె చెల్లించమన్నందుకు ఇంటి యజమానినే చెప్పుతో కొట్టారు. దీంతో ఆ మహిళ తక్షణం ఇల్లు ఖాళీ చేయాలంటూ ఎ

తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ తెరాసకు చెందిన ఎమ్మెల్సీ ఒకరు తన జులుం ప్రదర్శించారు. ఇంటి అద్దె చెల్లించమన్నందుకు ఇంటి యజమానినే చెప్పుతో కొట్టారు. దీంతో ఆ మహిళ తక్షణం ఇల్లు ఖాళీ చేయాలంటూ ఎమ్మెల్సీ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రజా ప్రతినిధిపై కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఒక ఎన్నారై మహిళ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటిని నాంపల్లి ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని ఖాళీ చేయమని ఎన్నారై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఆయన పట్టించుకోవడం లేదు. ఈనేపథ్యంలో ఆమె నేరుగా ఎమ్మెల్సీ వద్దకెళ్లి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 
 
దీంతో ఆసహనానికి గురైన ఎమ్మెల్సీ ఫరూఖ్ దిక్కున్నదగ్గర చెప్పుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ అయిన తనను ఎవడు ఖాళీ చేయిస్తాడో చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఆమెను చెప్పుతో కొట్టారు. దీంతో ఆమె నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 
 
దీంతో ఫారూఖ్ హుస్సేన్‌పై కేసు నమోదైంది. అద్దె చెల్లించాలని అడిగితే... తనపై దాడి చేశారంటూ ఆ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఫారూఖ్ హుస్సేన్‌పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.