శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:58 IST)

మెట్రో రైల్ స్టేషన్ నుంచి కిందకు దూకేసిన వ్యక్తి...

హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో రైళ్ళు లేదా మెట్రో స్టేషన్‌లలో తరచూ విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి దిల్‌సుఖ్ నగర్ మెట్రో స్టేషన్‌ నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానేవున్నట్టు సమాచారం. 
 
అయితే, మెట్రో స్టేషన్ నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.