1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:56 IST)

యూకేలో హైదరాబాద్‌ స్టూడెంట్ మృతి.. బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని..

Student
Student
హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సాయి తేజస్విని అనే విద్యార్థిని యూకేలో విషాదకరంగా మరణించింది. ఆమె అక్కడి యూనివర్సిటీలో ఏరోనాటిక్స్- స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మే 11న బ్రైటన్ బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
తన కలలను సాకారం చేసుకునేందుకు విదేశాల్లో చదువుకుంటున్న సాయి తేజస్విని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి మునిగిపోయింది.