ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (09:11 IST)

మాకు పదవులు - డబ్బు ముఖ్యం కాదు.. శృంగారమే ప్రధానం...

ఇతర రాజకీయ నేతల్లా మాకు పదవులు, డబ్బుపై పెద్ద వ్యామోహం లేదు. మాకు కావాల్సిందింతా 24 గంటలూ శృంగార కార్యకలాపాల్లో మునిగితేలడమని అరబ్ షేక్‌లు అంటున్నారు. ఊత కర్ర సాయంతో నడిచే 8 మంది అరబ్ షేక్‌లు 16 యేళ్ల

ఇతర రాజకీయ నేతల్లా మాకు పదవులు, డబ్బుపై పెద్ద వ్యామోహం లేదు. మాకు కావాల్సిందింతా 24 గంటలూ శృంగార కార్యకలాపాల్లో మునిగితేలడమని అరబ్ షేక్‌లు అంటున్నారు. ఊత కర్ర సాయంతో నడిచే 8 మంది అరబ్ షేక్‌లు 16 యేళ్ల అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారితో రాసలీలల్లో మునిగితేలేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చి పోలీసులకు పట్టుబడిన విషయం తెల్సిందే. ఈ కేసులో అరబ్ షేక్‌ల వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. 
 
"కోట్ల డబ్బు ఉండగానే సరిపోదు. దాన్ని ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మీవాళ్లు ఎప్పుడూ డబ్బు.. పదవులు.. పేరుప్రతిష్ఠలంటూ ఎగబడుతుంటారు. శృంగారాన్ని వదిలేస్తారు. మేం అలా కాదు.. మాకు కావాల్సింది సెక్స్‌. దానికోసం ఏదైనా చేస్తాం" అని విచారణలో ఓ అరబ్ షేక్‌ చెప్పినట్టు సమాచారం. బాలికలతో తమ పైశాచిక ఆనందాన్ని తీర్చుకునేందుకే వారు పాతబస్తీకి వస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
 
కాగా, ఇటీవల నగర పోలీసులు అరబ్‌షేక్‌లు, ఖాజీలను అరెస్ట్‌ చేయటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికోసం నగరానికి వచ్చిన అరబ్‌షేక్‌లను టూరిస్ట్‌లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సౌదీ ఎంబసీలోని కొందరు అధికారులు పోలీసు అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చినట్లు సమాచారం. పెళ్లికోసమంటూ సర్టిఫికెట్లతో వచ్చిన వీరిని పర్యాటకులుగా పేర్కొనటంపై ఓ పోలీసు ఉన్నతాధికారి వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.