బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (17:07 IST)

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు

double decker
double decker
హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. రాజధాని నగర రహదారులపై ఇకపై డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. 
 
ఈ డబుల్ డెక్కర్ బస్సులు సికింద్రాబాద్- మేడ్చల్, సికింద్రాబాద్- బాలానగర్, లింగంపల్లి, అప్జల్‌గంజ్ - మెహిదీపట్నం, జీడిమెట్ల- సీబీఎస్, పటాన్ చెరు మార్గాల ద్వారా ఈ బస్సు నడుస్తుంది. 
 
అంతేకాకుండా నగర రోడ్లపై తిరిగే డహుల్ డెక్కర్ బస్సులన్నీ ఏసీవే కావడం గమనార్హం. ఈ బస్సుల కోసం టెండరు ఈ నెల 21వ తేదీన పూర్తి కానుంది. ఇప్పటికే రూటు సర్వేలు కూడా పూర్తి చేశారు. 
 
అద్దె ప్రాతిపదికన 10 డబుల్ డెక్కర్‌తో పాటు 350 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. ఎలక్ట్రిక్ బస్సులు అన్ని మార్గాల్లో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.