సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (14:10 IST)

హైదరాబాద్ నగరంలో దారుణం.. భవనంపై నుంచి వ్యక్తిని తోసిన ప్రేమజంట

crime scene
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక ప్రేమ జంటను దారుణానికి ఒడిగట్టింది. ఓ వ్యక్తిని భవనంపై నుంచి కిందికి తోసేసింది. నాగవర్థిని అనే యువతి తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. భవనంపై కిందపడిన వ్యక్తి ప్రస్తుతం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులు బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని. వీరిద్దరూ కృష్ణా నగరులో షూటింగ్‌లో పని చేస్తున్నట్టుగు గుర్తించారు. అయితే, వారు ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోలీసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.