శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (14:02 IST)

హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఐటీ సోదాలు

హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. కంపెనీకి చెందిన కార్యాలయాలతోపాటు ప్రొడక్షన్ కేంద్రాల్లోనూ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. 
 
ఏకకాలంలో హెటిరో డైరెక్టర్లు, సీఈవో కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇరవై బృందాలుగా విడిపోయిన అధికారులు దాడులను నిర్వహిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 
గత ఫిబ్రవరి - మార్చిలో ఐటీ దాడుల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దాదాపు రూ.4 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజా దాడులు ఎటు దారి తీస్తాయనేది ఉత్కంఠ ఉంది. హెటిరోపై ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.