Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్ళు లేవంటే బాత్‌రూమ్ నీళ్ళు తాగా: కెటిఆర్

Written By జె
Updated: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (19:56 IST)
కెసిఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కెటిఆర్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తెలంగాణా ఐటి శాఖామంత్రిగా, యువ రాజకీయ నాయకుడిగా తెలంగాణా రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే ఈమధ్య విదేశీ పర్యటనల్లో కెటిఆర్ చాలా బిజీగా ఉన్నారు. హైదరాబాదులో నీటి సమస్య ఎక్కువగా ఉండడంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఈమధ్య ఒక సభలో మాట్లాడిన కెటిఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే నీటి సమస్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు. విదేశీ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ హోటల్‌కు ఒక రోజు వెళ్ళా. గదికి వెళ్ళి నీళ్ళ కోసం చూశా. కానీ ఎక్కడా కనిపించలేదు. ఏంటిది అనుకుని రిసెప్షన్‌కు ఫోన్ చేశా. బాత్రూం నీళ్ళు తాగండని చెప్పాడు. ఆశ్చర్యపోయా.
 
బాత్రూంలోకి వెళ్ళా. ఒక చిన్న స్టాండ్‌లాగా ఉంది. స్టాండ్ పక్కనే జూరి వాటర్ రాసుంది. ఈ నీళ్ళు ఎంతో సేఫ్టీ. మినరల్ వాటర్ కంటే బెట్టర్ స్టాండెర్డ్‌తో ఉంటుందని రాసి ఉంది. ఆశ్చర్యపోయి ఆ నీటిని తాగి నీళ్ళ దప్పిక తీర్చుకున్నా. అలాంటి వాటర్ కాకున్నా మినరల్ వాటర్ ను తెలంగాణా ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇచ్చి తీరుతామని చెప్పారు కెటిఆర్.

అన్నీ చూడండి

అసభ్యకరంగా చూపించే చిత్రాల్లో అస్సలు నటించను : కయదు లొహర్

కర్మ చక్రాలు తిరుగుతున్నాయి... రాబోయే కాలం నాది : తనూశ్రీ దత్తా

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

తర్వాతి కథనం
Show comments