పెళ్లికి ప్రేయసి ఒప్పుకోలేదని.. బీర్ బాటిల్‌ను తలపై మోది చంపేశాడు..

శనివారం, 22 మే 2021 (09:32 IST)
ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆపై ప్రేయసిపై అనుమానం పెంచుకున్నాడు. అంతే హత్య చేయాలనుకున్నాడు. పక్కాప్లాన్ ప్రకారం ప్రియురాలుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టాడు. అనంతరం అదే సీసాతో గొంతు కోసి చంపాడు. తెలిసీతెలియని వయసులో మరో ప్రేమకథ విషాదాంతమైంది. ఈ దారుణ ఘటన నాగార్జునసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు చందన(18)కు అనుముల మండలం కొరివేనిగూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శంకర్‌ (19) అనే యువకుడితో కొద్దికాలంగా పరిచయం ఉంది. శుక్రవారం అతడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లింది. 
 
వీరు నాగార్జునసాగర్‌ సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంకర్‌ బాగా మద్యం తాగాడు. ఈ క్రమంలో పెళ్లి విషయమై వాదనలు జరిగాయి.
 
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతున్నావని అనుమానం వ్యక్తం చేస్తూ ఆవేశానికి గురైన శంకర్‌.. బీరుసీసాతో చందన తలపై బలంగా కొట్టాడు. పగిలిన సీసాతో గొంతుకోయడంతో తీవ్ర రక్తస్రావమై చందన అక్కడికక్కడే మరణించింది. అనంతరం నిందితుడు హాలియా పోలీసులకు లొంగిపోయాడు. 

అన్నీ చూడండి

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

తర్వాతి కథనం
Show comments