శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (12:49 IST)

ధన్య బాలకృష్ణ మద్యం సేవించిందా?

కోలీవుడ్‌కు చెందిన యువ హీరోయిన్లలో ధన్య బాలకృష్ణ ఒకరు. ఈమె గతంలో 'సెవంత్‌ సెన్స్‌', 'లవ్‌ ఫెయిల్యూర్‌',  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'రాజారాణి' వంటి సినిమాల‌తో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. ఈ నేప‌థ్యంలో 'రాజారాణి' సినిమాలో పాత్రని మీ నిజ జీవితంతో సరిపోల్చవచ్చా? అంటూ ఓ అభిమాని అడిగాడు.
 
దీంతో ఆమె స్పందిస్తూ.. 'రాజారాణి' సినిమాలో తాను మందు తాగినట్లు చూపించారని తెలిపింది. అయితే, తాను మందు తాగ‌లేద‌ని, తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని స్ప‌ష్టం చేసింది. 
 
అయితే, తాను ఎక్కువగా పార్టీలు చేసుకోనని, అయితే, వారాంతపు రోజుల్లో మాత్రం త‌న‌ స్నేహితుల్ని కలిసి వాళ్లతో భోజనానికి వెళ్తానని తెలిపింది. అలాగే, లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి  వెళ్తానని చెప్పింది.