శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (15:59 IST)

అపుడపుడూ బెంగుళూరు డాక్టరుతో డేటింగ్ చేశా : సంజనా గల్రానీ

కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు జీవితం గడిపిన హీరోయిన్ సంజనా గల్రానీ. ఈమె చెల్లి నిక్కీ గల్రానీ. తమిళంలో పాపులర్ హీరోయిన్. అయితే, సంజనా గల్రానీ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇటివలే జైలు నుంచి విడులైన ఈమెకు కరోనా వైరస్ సోకింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, గత యేడాది త‌న ప్రియుడితో క‌లిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. త‌న జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ గ‌తేడాది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది. 
 
డ్ర‌గ్స్ కేసులో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌నుకున్నాను. ఇంతలోనే క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణగా తేలిందన్నారు. త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి కోలుకుంటున్నాన‌న్న న‌మ్మ‌క‌ముందని చెప్పారు 
 
ఇకపోతే, అజీజ్‌ పాషా అనే వ్యక్తి బెంగ‌ళూరులోకి ఓ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్. మేమిద్ద‌రం చిన్న‌నాటి నుంచి స్నేహితులం. మా స్నేహం ప్రేమ‌గా మారింది. మేమిద్ద‌రం డేటింగ్‌లో కూడా ఉన్నాం. అయితే మా ప్రేమ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌కుండా ర‌హ‌స్యంగా ఉంచాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది.