బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్

చెన్నై చంద్రం పెళ్లెపుడు? కోలీవుడ్‌లో పుకార్లు

చెన్నై చంద్రం తిష త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గ‌తంలో వ్యాపార వేత్త వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న త్రిష కొద్ది రోజుల‌కే అత‌నికి బ్రేక‌ప్ చెప్పింది. ఇక అప్ప‌టి నుండి పెళ్లి ఊసే ఎత్త‌ని త్రిష ఇప్పుడు ఓ మంచి వ్య‌క్తిని వివాహం చేసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తుంద‌ని కోలీవుడ్ టాక్.
 
త్రిష ప్ర‌స్తుతం వ‌య‌స్సు 38 సంవ‌త్స‌రాలు కాగా, ఈ అమ్మ‌డు తెలుగు,త‌మిళ భాష‌ల‌లో స‌త్తా చాటింది. ఇప్పుడు త్రిష‌కు ఆఫ‌ర్స్ క‌రువయ్యాయి. దీంతో పెళ్లి చేసుకోనే ఆలోచ‌న చేస్తుంద‌ట‌. కాగా, తెలుగులో టాప్ స్టార్స్ అంద‌రితో క‌లిసి నటించిన త్రిష... ఈ అమ్మ‌డు అంటే అభిమానులు కూడా ప‌డిచ‌చ్చిపోయేవారు. 
 
కొన్నాళ్ల‌పాటు త్రిష కెరియ‌ర్ స‌జావుగానే సాగిన ఆ త‌ర్వాత తెలుగులో ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. దీంతో త‌మిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ అక్క‌డి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసింది.