శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

తమిళ హీరో కార్తీక్ ఆరోగ్యం విషమం? ఐసీయూ వార్డులో చికిత్స

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు కార్తీక్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలోని ఐసీఊ వార్డులో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
తెలుగులో "సీతాకోకచిలుక" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన నటుడు కార్తీక్. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. ఇలాంటి చిత్రాల్లో ఒకటి తూర్పు సింధూరం. అలాగే తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చకున్నాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ నటించారు. 
 
ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఈయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఈ మధ్యే తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన కార్తీక్.. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాడు. అయితే మళ్లీ ఇప్పుడు అనారోగ్యం తిరగబెట్టింది. ఈ మధ్యే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగమైన మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. దాంతో వెంటనే హస్పిటల్‌లో చేర్పించారు కుటుంబ సభ్యులు.
 
నటుడిగా బిజీగా ఉన్న ఈయన.. రాజకీయాల్లోకి రావడమే కాకుండా సొంతంగా పార్టీ కూడా పెట్టారు. కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసాడు. మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాడు . అంతేకాదు పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఈ క్రమంలోనే అనారోగ్యం పాలయ్యారు. 
 
ఆయనను అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ హీరో ప్రస్తుతం శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు.ఇప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. కార్తీక్‌కు బీపీ కూడా ఎక్కువైనట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఈయన హాస్పిటల్‌లోనే ఉన్నారు. 
 
కార్తీక్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక సమాచారం బయటికి రావాల్సి ఉంది. ఈయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.