Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పపీడన ప్రభావం - దంచికొడుతున్న వర్షం

Written By వరుణ్
Updated: గురువారం, 22 సెప్టెంబరు 2022 (14:53 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో జోరుగా వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. 
 
ముఖ్యంగా, భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, మాదాపుర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్​లో భారీ వర్షం కురిసింది. వెంగల్‌రావునగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, ముషీరాబాద్, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్​బండ్‌, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పుర్‌ ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. 
 
అలాగే, దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్‌, గుడిమల్కాపూర్, మెహదీపట్నం,కార్వాన్, లంగర్​హౌస్‌, జియాగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. శంషాబాద్‌, ఆరాంఘర్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, కిస్మత్‌పూర్‌, గండిపేట్, మణికొండ, నార్సింగి, మియాపూర్, చందానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నామా, బార్కస్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments