Festival Posters
✕

డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదు.. అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం

Written By సెల్వి
Updated: సోమవారం, 2 మే 2022 (19:27 IST)
డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదనే మనస్తాపంతో తెలంగాణ అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న అసెంబ్లీ సిబ్బంది అడ్డుకుని, అతన్ని రక్షించారు. 
 
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
 
గతంలో కూడా తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీ ఎదుట నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 
 
తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బందోబస్తులో భాగంగా అక్కడే ఉన్న పోలీసులు అతన్ని కాపాడి ఆస్పత్రికి తరలించారు.  

అన్నీ చూడండి

AA23 Upadate : AA23 చిత్రంలో గ్యాంగ్‌స్టర్ గా అల్లు అర్జున్ చూపించనున్న లోకేష్ కనగరాజ్‌

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసేలా మాయలేడి ఉంటుంది - రాకేష్ వర్రే

Raj Tarun : రాజ్ తరుణ్... టార్టాయిస్ సినిమా నుంచి రంగు రంగు రంగు పిల్లరో లిరికల్ సాంగ్

పిల్లలందరూ చూసే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు : తణికెళ్ల భరణి

Prabhas’s 24-year: రెబల్ స్టార్ ప్రభాస్ 24 ఏళ్ల నట ప్రస్థానం, సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్

తర్వాతి కథనం
Show comments