ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 11 మార్చి 2020 (15:51 IST)

అమృత ఎందుకలా మాట్లాడింది..?

మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే మారుతీరావు అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళ్లిన మారుతీరావు కూతురు అమృతకి అక్కడ చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి.

మారుతీరావు తరపున బంధువులు అందరు కూడా అమృత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తరువాత మీడియా ఛానల్ వారు మారుతీరావు కూతురు అమృతతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో తన బాబాయ్ శ్రవణ్‌ని లైవ్‌లో ఫోన్లో మాట్లాడించారు.
 
అయితే ఈ సందర్భంగా వారిద్దరి మధ్యన మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఈ సమయంలో అమృత తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపించారు. అంతేకాకుండా నేను కూడా యిప్పుడు ఆత్మహత్య చేసుకుంటాను. దాన్ని కూడా మీరు లైవ్‌లో చూపించండి అంటూ ఆవేశంతో లోపలి వెళ్లి తలుపులు వేసుకునేందుకు యత్నించింది. 
 
ఆ సమయంలో తానూ స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఏదేమైనప్పటికీ కూడా మారుతీరావు మరణంతో ఈ వివాదం సద్దుమణుగుతుందని అందరు భావించినప్పటికీ ఇది ఇంకా పెరిగిపోతుంది.