శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (15:42 IST)

మారుతీ రావు ఆస్తుల విలువ రూ.200 కోట్లు, అవి ఎవరికి చెందుతాయి?

కూతురు వివాహంతో ఆయన కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ఎంతో కష్టించి ఆర్జించిన సొమ్మును అనుభవించే స్థితి లేక మారుతీరావు ఆత్మహత్య చేస్కున్నాడు. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మారుతీరావు కుమార్తె అమృత తండ్రిపై కేసు పెట్టడం, అది కోర్టులో నడుస్తూ వుండటంతో పాటు మరికొద్ది రోజుల్లో నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే పరిస్థితి. 
 
ఈ నేపధ్యంలో బెయిల్ పైన వున్న మారుతీరావు కుమార్తెతో కేసు సయోధ్య కోసం ప్రయత్నించాడన్న వార్తలు వచ్చాయి. ఐతే ఆ విషయంలో విఫలమైన మారుతీరావు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. కిరోసిన్ డీలర్‌గా మొదలైన మారుతీరావు ఆ తర్వాత రైస్ మిల్లులు కొన్నాడు. వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. 
 
ఆ తర్వాత ఇక వెనక్కి చూసుకునే పరిస్థితి ఎదురుకాలేదు. కోట్లు గడించాడు. ఇదిలావుండగానే కుమార్తె ఓ ప్రణయ్ అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. అక్కడి నుంచి అతడి కుటుంబంలో చిచ్చు రేగింది. ప్రణయ్‌ను హత్య చేయించడం, ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు అతడి పేరు మీద వున్న ఆస్తుల లెక్కలు బయటకు వస్తున్నాయి.
 
చార్జ్ షీట్‌ ప్రకారం మారుతీరావు ఆస్తుల వివరాలు ఇలా వున్నాయి
 
1. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్
2. మారుతీ రావు తల్లి పేరుతో రెండంతస్తుల భవనం
3. మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి
4. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయం
5. అమృత ఆస్పత్రి పేరుతో వంద పడకల ఆస్పత్రి
6. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి
7. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం
8. హైదరాబాద్‌లో పలు చోట్ల 5 ఫ్లాట్లు
ఇంకా కొన్ని ఆస్తులు బినామీ పేర్లపై వున్నట్లు కుమార్తె అమృత తెలిపింది. ఈ లెక్కన మారుతీరావు ఆస్తుల విలువ సుమారు 200 కోట్లు వుంటుందని అంచనా.