గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (12:39 IST)

మిడ్‌నైట్ బిర్యానీ విత్ మసాలా... ఎక్కడ?

biryani midnight
ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీకి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి ఫోన్ చేసి బిర్యానీ దుకాణాల సమయంపై ఆరా తీశాడు. అంటే హైదరాబాద్ నగరంలో బిర్యానీ దుకాణాలను రాత్రి ఎన్నికల గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి చాలా ఓపిగ్గా సమాధానమిచ్చారు. రాత్రి 11 గంటల వరకు బిర్యానీ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ హైదరాబాద్ నగర పౌరుడికి మంత్రి బదులిచ్చాడు. 
 
అయితే, చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి, ఎంఐఎం నేతలు ఇటీవలి నగర పోలీసు కమిషనర్‌ను కలిసి, అర్థరాత్రి  ఒంటి గంట వరకు బిర్యానీ రెస్టారెంట్లు తెరిచి ఉంచడానికి అనుమతించాలని కోరారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసు కమిషనర్ అందుకు అంగీకరించారని, రెండు రోజుల్లో పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిసింది. దీంతో పాతబస్తీలోని స్థానిక వ్యాపార యజమానులు తెలంగాణ ప్రభుత్వానికి, నగర పోలీసు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.