Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి మంత్రి ఎర్రబెల్లి సోదరుడు?

Written By ఎం
Updated: బుధవారం, 16 డిశెంబరు 2020 (06:15 IST)
ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. తాజాగా మంత్రి సోదరుడు కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
 
తెలంగాణ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పాలిటిక్స్ బాగా నడుస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీలో ఫుల్ జోష్ వచ్చింది. దీనికి తోడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చాయి.

ఈ గెలుపుతో ఇప్పుడు పలువురు నేతలు కమలం వైపు చూస్తున్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ఇప్పటినుంచే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌కు చెందిన అనేకమంది మాజీ నేతలు, సీనియర్లు కమలం కండువా కప్పేసుకున్నారు. అటు కాంగ్రెస్ నుంచి కొందరు సీనియర్లు కమలం తీర్థం పుచ్చుకున్నారు.
 
పలు పార్టీల్లో ఉన్న అసంతృప్తులందరికీ ఇప్పుడు బీజేపీయే దిక్కయ్యింది. తాజాగా.. టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.

అయితే ఆయన పార్టీ మారడం వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తమ పార్టీలో పక్కకు పెట్టిన వారు పార్టీ మారడం సహజమేనని దీనిపై ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments