Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న ముత్తిరెడ్డికి.. నేడు బాజిరెడ్డికి కరోనా..

Written By సెల్వి
Updated: సోమవారం, 15 జూన్ 2020 (19:50 IST)
తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే తెలంగాణలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా సోకింది. ఒక రోజు గ్యాప్‌తో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా కన్ఫర్మ్ అయ్యింది. ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా రావడంతో నిజామాబాద్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బాజిరెడ్డితో ఎవరెవరు కాంటాక్ట్ ఉన్నారో వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు.
 
ఎమ్మెల్యే బాజిరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఓపెనింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఎవరెవర్ని కలిశారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కరోనా సోకి 24 గంటలకు కూడా కాకముందే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. 
 
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేతో అర్బన్ ఎమ్మెల్యే కాంటాక్ట్‌లో ఉండటం వలన ఆయనకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే గణేష్ గుప్తాలో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments