suvichar

తెలంగాణలో మొబైల్​ రైతు బజార్లు

Written By ఎం
Updated: శుక్రవారం, 27 మార్చి 2020 (20:12 IST)
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్​డౌన్​ నూరు శాతం సఫలీకృతం అయ్యేలా.. మొబైల్​ రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ అడిషనల్​ డైరక్టర్​ లక్ష్మణుడు తెలిపాడు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు బజార్​ను ఆయన పరిశీలించారు.

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయ మార్కెట్​ శాఖ ఆధ్వర్యంలో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా​ వనస్థలిపురంలోని రైతు బజార్​ను వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు పరిశీలించారు. కూరగాయాలు విక్రయించే వారు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు.

మాస్క్​లను ధరించాలని, క్యూ పద్ధతి, సామాజికి దూరం పాటించాలని విక్రయదారులను, కొనుగోలు దారులను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ మొబైల్ రైతు బజార్ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకుని లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లలో పండ్లునూ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అన్నీ చూడండి

Kaka Latest: బాధ్యతల గల పాత్రగా కాకా ని మలుస్తున్న బాబీ కొల్లి - చిరంజీవిపై కీలక సన్నివేశాలు

Balakrishna's entry : దాదా షూటింగ్ లో నందమూరి బాలక్రిష్ణ ఎంట్రీ - కలెక్టర్ గా కాజల్ అగర్వాల్

Nani: శ్రీకాంత్ మొండితనం వల్లే ప్యారడైజ్ ఆలస్యం అయింది : న్యాచురల్ స్టార్ నాని

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తర్వాతి కథనం
Show comments