ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (06:12 IST)

డిసెంబ‌ర్ 25న భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఉత్స‌వాల‌కు భ‌ద్రాచ‌లం సీతా రామ‌య్య ఆల‌యంలో ముహుర్తం ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 4వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ఏకాద‌శి ప్ర‌యుక్త అధ్య‌య‌నోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు.

డిసెంబ‌ర్ 24న శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామి వారికి తెప్పోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 25న ముక్కోటి ఏకాదశి, ఉత్త‌ర ద్వార‌ ద‌ర్శ‌నం వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఈ వేడుక‌ల‌కు సంబంధించి ఆల‌య అధికారులు ఏర్పాట్లు చేయ‌నున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.