బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (06:08 IST)

అస‌త్య‌మే బిజెపి ఆయుధం: మంత్రి హ‌రీష్ రావు

బిజెపి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో జూటా మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట‌లో మంత్రి హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర బిజెపి నాయ‌కులు త‌మ వైఖ‌రితో బిజెపిని భార‌తీయ జూటా పార్టీగా మార్చేశార‌ని పేర్కొన్నారు.

పూట‌కో పుకారు పుట్టించి.. గంట‌కో అబ‌ద్దం మాట్లాడ‌టం బిజెపి నాయ‌కుల నైజం అని మండిప‌డ్డారు. వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాల‌నే సామెత అంద‌రికి గుర్తే.. అలా దుబ్బాక‌లో వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక ఎన్నిక గెల‌వాలె అనే కొత్త సామెత‌ను సృష్టిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.
 
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం నుంచి ఒక్క బిజెపి నాయ‌కుడు కూడా నిజం మాట్లాడ‌టం లేదు.. అబ‌ద్దాలే పునాదిగా బిజెపి నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చారాల‌కు తెర‌తీసింద‌న్నారు. బిజెపి రాష్ర్ట అధ్య‌క్షుడు మొద‌లుకొని గ్రామ‌స్థాయి వార్డు నేత దాకా అంద‌రూ అబ‌ద్దాలు ఆడేవారే అని ధ్వ‌జ‌మెత్తారు.

అస‌త్య‌మే బిజెపి ఆయుధం అని కోపోద్రిక్తుల‌య్యారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు వారి నైజం అని విరుచుకుప‌డ్డారు. భార‌తీయ సాంప్ర‌దాయానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బిజెపి నాయ‌కులు.. స‌త్య‌మేవ జ‌య‌తే అనే ఉప‌నిష‌త్ సూక్తిని విస్మ‌రించారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.