శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (11:55 IST)

కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లిదండ్రులు

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లిదండ్రుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఐదు నెలల తర్వాత తమ బిడ్డను తమకు ఇప్పించాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మీనా, వెంకటేష్ దంపతులకు జులై 19న బిడ్డ పుట్టగానే ఓ మధ్యవర్తి ద్వారా వేరొకరికి అమ్మేసారు.
 
కప్రా సర్కిల్లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజేష్.. మీనాను తన భార్య అని చెప్పి ఈఎస్ఐ ఆస్పత్రిలో డెలివరీ చేయించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకువెళ్లాడు. ఈఎస్ఐ ఆస్పత్రి సాక్షిగా బిడ్డ అమ్మకం గుట్టుగా సాగిపోయింది. అయితే తనకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు ఐదు నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. 
 
తనకు మగబిడ్డ పుడితే ఆ విషయం దాచిపెట్టి మధ్యవర్తి అమ్మేశాడని చెప్పింది. ఇప్పుడు తన కొడుకు కావాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి.. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.