కూకట్‌పల్లి ప్రజలారా...: నందమూరి సుహాసిని బహిరంగ లేఖ
కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేయడం.. ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. తన ఓటమిని అంగీకరిస్తూ ఆమె కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ.. నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి, అక్కున చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
నన్ను ఆదరించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇక్కడే (కూకట్‌పల్లి) ఉండి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను. ఈ ఎన్నికలలో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా అంటూ సుహాసిని తన లేఖలో తెలిపారు.