సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (12:29 IST)

తారక్‌ అన్నయ్య పుత్రుడే కాదు.. నాకూ కుమారుడే : బాలయ్య

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి సుహాసిని పోటీ చేసిన సంగతి తెలిసిందే. సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేయలేదనే దానిపై రచ్చ రచ్చ జరిగింది. దీనిపై ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలయ్య స్పందించారు. 
 
సుహాసిని కోసం ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ఎదుగుతూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో  ప్రచారంలో పాల్గొంటే కొంతమంది నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు. అందుకే తారక్‌ను ఎన్నికల ప్రచార బరిలోకి దించలేదని బాలయ్య క్లారిటీ ఇఛ్చారు. 
 
ఆ భయంతోనే తాను తారక్‌ను ప్రచారానికి రావొద్దని చెప్పానని.. తారక్ తన అన్నయ్య పుత్రుడు మాత్రమే కాదని.. తనకు కూడా కుమారుడేనని బాలయ్య వ్యాఖ్యానించారు. కాగా, సుహాసినికి మద్దతుగా తారకరత్న, నందమూరి జానకిరామ్ భార్య, బాలకృష్ణ ఇలా ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.