శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (19:13 IST)

తెలంగాణ చీఫ్ సెక్రటరీపై ఎన్జీటీ ఫైర్

తెలంగాణ చీఫ్ సెక్రటరీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ కంకరమిషన్లపై సరైన చర్యలు తీసుకోలేదని ఎన్జీటీ కన్నెర్ర చేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది.
 
చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశించింది ఎన్జీటి. తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని ,ప్రసుత్తం 208 పని చేయడం లేదని, 74 కంకర మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంతో మూసివేయించామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ సీఎస్. 
 
హైదరాబాద్ శివారులో మైనింగ్ జోన్ వల్ల తలెత్తుతున్న పర్యావరణ సమస్యల పై వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు ఇచ్చింది ఎన్జీటీ. తదుపరి విచారణ ఏప్రిల్ 28 కి వాయిదా వేసింది చెన్నై ఎన్జీటీ.