Dharma Sangrah
✕

బిర్యానీ పొట్లాల్లో ముక్కుపుడకలు.. అడ్డంగా బుక్కైన శ్యాంసుందర్

Written By సెల్వి
Updated: బుధవారం, 10 మార్చి 2021 (12:02 IST)
ఎన్నికలంటేనే ఓట్లు పడాలంటే నోట్లు పడతాయి. ఇంకా కానుకలకు కొదువ వుండదు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు డబ్బులు, బంగారం, మద్యం, బిర్యానీలు అంటూ బాగానే అందజేస్తారు. అయితే ఇక్కడ సీన్ మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్‌ పోటీ చేస్తున్నాడు. 
 
ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.

అన్నీ చూడండి

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

repeat movie review :ఈ నగరానికి ఏమైంది, రిపీట్ చిత్రం ఎందుకు తీశారంటే.. రిపీట్ రివ్యూ

రాజా సింగ్‌ను కలిసిన దేవి విజ్ఞానం హిందీ చిత్ర బృందం, డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల

తర్వాతి కథనం
Show comments