శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:14 IST)

బిర్యానీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది..

బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. అలాంటి బిర్యానీ టేస్టీగా దొరికితే లొట్టలేసుకుని మరీ లాగించేస్తుంటారు చాలామంది. బిర్యానీ వేడి వేడిగా వేగంగా తినేస్తుంటారు చాలామంది. ఇలా బిర్యానీ తింటుండగా గుండెపోటుతో రావడంతో ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. 
 
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నగట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(40) బంధువు వారం రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. వారి కుటుంబీకులను పరామర్శించేందుకు ఆమె సిటీకి వచ్చింది.
 
గురువారం తిరిగి సొంతూరికి వెళ్లేందుకు సాయమ్మ శంషాబాద్ బస్టాండ్‌కి చేరుకుంది. అక్కడ బాక్సులో తన వెంట తెచ్చుకున్న బిర్యానీని తింటూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఐ విజయ్ కుమార్ సాయమ్మ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.