Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బంగారు కాదు.. బలి తెలంగాణ: సంజయ్‌

Written By ఎం
Updated: శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:23 IST)
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్‌ నాయక్‌ మృతికి సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘బంగారు తెలంగాణ అన్నావ్‌.. బలి తెలంగాణను చేశావ్‌’ అని ఘాటుగా విమర్శించారు.

శుక్రవారం రాత్రి సునీల్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్‌ జిల్లాకు వెళ్తున్న సంజయ్‌ని భూపాలపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. సునీల్‌నాయక్‌ మృతదేహానికి గన్‌పార్కు వద్ద నివాళులర్పించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం నిరాకరించడం దారుణమన్నారు.

సునీల్‌ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ రూ.లక్ష సహాయం ప్రకటించటం సిగ్గుచేటని విమర్శించారు. సునీల్‌ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆయన సోదరుడు శ్రీనివా్‌సకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉదయం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద సునీల్‌ కుటుంబ సభ్యుల్ని సంజయ్‌ పరామర్శించారు. సునీల్‌ ఆత్మహత్య.. నిరుద్యోగుల పట్ల టీఆర్‌ఎస్‌ సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. 

అన్నీ చూడండి

చిన్నప్పటి నుంచి ఆ హీరో అంటే నాకు క్రష్ : నటి ఆనంది

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ

Suriya: వీడియో గేమ్ కాన్సెప్ట్ తో సీన్ చిత్రంలో సూర్య, నజ్రియా నజీమ్‌ పై సాంగ్

Rahul Sankrityan: తను దేవుళ్లతో మాట్లాడుతాడు, రాక్షసులను ఎదుర్కొంటాడు.. అతనే రణబాలి : రాహుల్ సంకృత్యన్

Vijay Deverakonda: రశ్మిక రానందుకు సారీ - నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు వారి జీవితాలు మార్చుకోండి : విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments