శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (21:06 IST)

బాప్‌రే 'బంగారం' గ్యాంగ్, కారులో రూ. 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారం పట్టివేత

బంగారం. ఏదో గ్రాముల లెక్కన కొనేందుకు మనం కిందామీద పడుతుంటాం. కానీ బంగారం గ్యాంగ్ మాత్రం కిలోల లెక్కన కొనేస్తుంటారు, తిప్పేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. కారులో పక్కాగా అమర్చిన ఈ బంగారం 26 కిలోలు వున్నట్లు డీఆర్ఐ అధికారులు తేల్చారు.
ఈ గోల్డ్ విలువ సుమారు రూ.12 కోట్లు. కలకత్తా నుంచి చెన్నైకి ముగ్గురు స్మగ్లర్లు ఈ బంగారాన్ని కారులో తీసుకుని వెళ్తున్నారు. ఈ 26 కిలోల బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కలకత్తా ముఠా అప్పగించింది.