మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (12:09 IST)

విశాఖలో రూ.25 లక్షలు పట్టివేత

విశాఖలోని చైతన్యనగర్‌ ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయిలను గాజువాక పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

సిరిపురం ప్రాంతానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చలుమూరి రామకృష్ణ ఏపీ 31డీటీ 4239 నంబరు కలిగిన కారులో మంగళవారం అక్రమంగా నగదును తరలిస్తున్నట్టు గాజువాక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో సీఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో చైతన్యనగర్‌ ప్రాంతంలో సంబంధిత కారును ఆపి తనిఖీ చేయగా రూ. 25 లక్షలు లభ్యమైంది.

ఈ నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గాజువాక తహసీల్దార్‌ సమక్షంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.