శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (10:41 IST)

భారీగా పడిపోయిన బంగారం ధరలు

మన ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న పసిడి ధర కాస్త పెరిగినా... ఇవాళ భారీగా తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 45,490 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210  తగ్గి రూ. 41,700 కు చేరింది.

ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా... వెండి ధరలు మాత్రం భారీగా నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.