ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (20:33 IST)

పప్పులుడకవ్-మమతా బెనర్జీ తర్వాతే ప్రధాని మోదీ: ప్రశాంత్ కిషోర్

కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా... పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలే ఇప్పుడు హాట్ టాపిక్. అక్కడ రాజకీయాలపై ఎవరు ఏం మాట్లాడినా వైరల్‌గా మారిపోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధమే కాదు.. ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న ఘటనలపై కూడా ప్రత్యేక ఫోకస్ ఉంది. ఇక, ఈ ఎన్నికల్లో ప్రముఖ పోల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిశోర్‌ కూడా అప్పడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
 
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. తన వృత్తిని వదిలేస్తానని ఇప్పటికే ప్రకటించిన పీకే.. ఇవాళ.. ప్రధాని నరేంద్ర మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ.. బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు.. కానీ, బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ తర్వాతనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దీదీ వర్సెస్ ప్రధాని మోడీ మధ్య జరుగుతోన్న పోరాటంగా అభివర్ణించిన ఆయన.. ఈ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఒకవేళ అదే జరిగితే తాను రాజకీయాలకు స్వస్థిపలుకుతానని మరోసారి ప్రకటించారు.
 
మరోవైపు.. సాధారణ ఎన్నికల్లో (లోక్‌సభ) భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుచూపిన బెంగాల్ ఎస్సీ ఓటర్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఎంసీకే ఓటేస్తారని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.. ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవిగా అభిప్రాయపడ్డ ఆయన.. గత 30-35 ఏళ్లలో పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీని జాతీయ పాలక పార్టీ సవాల్ చేయలేదని చెప్పుకొచ్చారు.