Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస సర్పంచ్ భర్తను ఉరితీయాలంటూ మంత్రి కేటీఆర్ ఆఫీస్ ముట్టడి

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:44 IST)
ఆరేళ్ల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన అధికార తెరాస నేత శంకర్‌ను ఉరి తీయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తెరాస పార్టీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆరేళ్ల గిరిజన బాలికపై గ్రామ మహిళా సర్పంచ్ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడు పేరు శంకర్‌. ఈయన్ను ఉరితీయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 
 
కామంతో రెచ్చిపోయి పసిపాపపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సమాజంలో ఉంటే ప్రమాదకరమని, అతడిని వెంటనే ఉరి తీయాలని స్థానికులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన శంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.
 
అయినప్పటికీ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన సంఘాలతో పాటు కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు శనివారం 8 గంటలపాటు ఆందోళన కొనసాగించారు. అయితే తమను ఎవరూ పట్టించుకోవటం లేదంటూ ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
 
మరోవైపు నిందితుడు శంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, పోలీసు అధికారులను కోరినట్లు టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్న ఆయన.. బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. 

అన్నీ చూడండి

Sree Vishnu: ఫ్యామిలీ ప్యాక్ తో సంక్రాంతి పోటీగా రాబోతున్న శ్రీ విష్ణు

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

తర్వాతి కథనం
Show comments