కరీంనగర్ జిల్లాలో దారుణం: యువకుడిపై పెట్రోల్ పోసి..!

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (14:01 IST)
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో యువకుడు పూర్తిగా కాలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 
 
వీడియోలో యువకుడి శరీరం పూర్తిగా కాలిపోయినట్టు కనిపిస్తోంది. చెట్ల పొదల్లో యువకుడిపై దాడి చేసి హతమార్చినట్లు కనిపిస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్ రావు పరిశీలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే దుండగులు ఎవరా అన్నది ఇంకా తెలియ లేదు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments