శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (09:20 IST)

8న హైదరాబాద్ వస్తున్న ప్రధాని.. షెడ్యూల్ ఇదే..

modi
ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు శంకుస్థాపనలు చేయనున్నారు. మరికొన్ని పూర్తయిన అభివృద్ధి పనులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను తెలంగాణ బీజేపీ శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
 
8న శనివారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అక్కడ నుంచి మధ్యాహ్నం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వస్తారు. అక్కడ సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య నడిచి వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 
 
12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు.