Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించిన ప్రశాంత్ కిషోర్

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (15:51 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. ఆయన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఆ రాష్ట్రంలో చేపట్టిన అనేక నీటి ప్రాజెక్టులను ఆదివారం పరిశీలించారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఆయన ప్రకాష్ రాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత మల్లన్న నిర్వాసితులతోకలిసి మాట్లాడారు. 
 
రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన పీకే బృందం... గత రెండు రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తుంది. అలాగే, ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ వంటిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ పీకే బృందం పరిశీలించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఏ ఒక్కరికీ బోధపడటం లేదు.
 
ఇదిలావుంటే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. ఇందులోభాగంగా ఆయన అనేక మంతి విపక్ష నేతలతో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ప్రశాంత్ కిషోర్‌ను తన ఎన్నికల వ్యూహకర్తగా సీఎం కేసీఆర్ నియమించుకున్న విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments