ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (15:29 IST)

టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాసేందుకు వచ్చిన గర్భిణీ మృతి

deadbody
టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాసేందుకు వచ్చిన గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. పటాన్‌చెరులోని టెట్ ఎగ్జామ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాసేందుకు వచ్చిన 8 నెలల గర్భిణీ రాధిక ప్రాణాలు కోల్పోయింది. 
 
లేట్ అవుతుందనే టెన్షన్‌తో పరీక్షా గదికి త్వరగా చేరుకునే క్రమంలో రాధికకు బీపీ ఎక్కువైంది. చెమటలొచ్చి పరీక్షా గదిలోనే కుప్పకూలిపోయింది రాధిక. వెంటనే ఆమెను భర్త అరుణ్ పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.