Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు త్వరగా స్పందించే వుంటే మా అమ్మాయి బ్రతికి వుండేది : ప్రియాంకా రెడ్డి తండ్రి ఆరోపణ

Written By జె
Updated: శుక్రవారం, 29 నవంబరు 2019 (18:23 IST)
హైదరాబాద్ సమీపంలో జరిగిన వైద్యురాలు ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అత్యాచారం తరువాత నిందితులందరూ పారిపోయారు. అయితే ప్రియాంకారెడ్డిపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. నిందితులందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా గుర్తించారు.
 
అయితే ప్రియాంకారెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. టోల్‌గేట్ దగ్గర మా అమ్మాయి ఒంటరిగా ఉంది. సి.సి.కెమెరాలు ఎన్నో ఉన్నాయి. మా అమ్మాయి కనిపించలేదని ఫిర్యాదు చేసినప్పుడు సి.సి.కెమెరాలు చూస్తూ కూర్చోవడం మానుకొని మా అమ్మాయి కోసం వెతికి ఉంటే ఆమె బతికి ఉండేది. 
 
ఫిర్యాదు చేయడానికి వెళితే పట్టించుకోలేదు. అసలు ఈ కేసు తమ పరిధిలోకి రాదనీ, రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. చివరికి మీడియాలో కథనాలు రావడంతో పరుగులు పెట్టారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే మాకు శోకం మిగిలేది కాదు. మా అమ్మాయి విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు శ్రీధర్ రెడ్డి. 

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments