అమ్మ మీద కోపం.. అర్థరాత్రి పూట రోడ్డుపైకి వచ్చిన యువతి.. పోలీసులతో సెల్ఫీ
అత్త కోపం ఓకే కానీ.. ఇక్కడ అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ కనిపించి.. హల్ చల్ చేసింది. అమ్మ మీద కోపం వుంటే సాధారణంగా ఇంట్లో అన్నం మానేయడం వంటివి చూసివుంటాం. కానీ ఓ యువతి మాత్రం అర్
అత్త కోపం ఓకే కానీ.. ఇక్కడ అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ కనిపించి.. హల్ చల్ చేసింది. అమ్మ మీద కోపం వుంటే సాధారణంగా ఇంట్లో అన్నం మానేయడం వంటివి చూసివుంటాం. కానీ ఓ యువతి మాత్రం అర్థరాత్రి రోడ్లపై ఒంటరిగా తిరిగింది. కానీ రోడ్లపై ఒంటరిగా తిరిగిన ఈ యువతిని చూసిన పోలీసులు ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే.. అమ్మ మీద అలకతో యూసుఫ్ గూడ నుండి బోరబండ వెళ్లే మార్గంలోని రహమత్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఓ యువతి రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ కన్పించింది. ఒంటరిగా ఎందుకు బయటికొచ్చావని పోలీసులు సదరు యువతిని ప్రశ్నిస్తే.. అమ్మపై కోపంతోనే తాను అర్థరాత్రి పూట ఇలా బయటకు వచ్చానని అసలు విషయం చెప్పింది.
వెంటనే సదరు యువతితో మాట్లాడిన పోలీసులు.. యువతికి నచ్చజెప్పి.. ఇంటి వద్ద దింపారు. ఈ సందర్భంగా యువత సెల్ఫీ దిగింది. రోడ్డుపై ఒంటరిగా తిరిగిన యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.