Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణ వాసులకు శుభవార్త... నేడు రేపు వర్షాలు

Written By వరుణ్
Updated: శుక్రవారం, 19 మే 2023 (09:51 IST)
సూర్య ప్రతాపంతో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుందని వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇకపోతే, గురువారం నల్గొండలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, భానుడి ప్రతాపంలో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments