Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కేసీఆర్ బయోపిక్ ఖాయం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా..?

Written By సెల్వి
Updated: గురువారం, 31 మార్చి 2022 (18:18 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు వర్మ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. కేసీఆర్ బయోపిక్ ఖాయమని వర్మ అంటున్నారు.  

ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, వంగవీటి, ఇక ఇటీవల కొండా లాంటి సినిమాలన్నీ బయోపిక్ లే.. ఇక ఈ సినిమాలను మొదలుపెట్టిన దగ్గరనుంచి విడుదలయ్యేవరకు వివాదాలతోనే వార్తల్లో నిలిచిన వర్మ మరోసారి సంచలనం సృష్టించాడు.
 
వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం డేంజరస్ అనే మూవీ తెరకెక్కిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బయోపిక్ సినిమా త్వరలో తీస్తాను. ఇప్పటికే బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్టు రెడీ గా ఉంది. త్వరలోనే షూటింగ్ ని మొదలుపెడతాను" అని చెప్పుకొచ్చాడు.  
 
నిజానికి కేసీఆర్ బయోపిక్ జనాలకు కొత్తకాదు. ఇప్పటికే కేసీఆర్ రాజకీయ జీవితంపై "ఉద్యమ సింహం" అనే సినిమా వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ సినిమా విడుదలను నిలిపివేస్తే, యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. 
 
తర్వాత మీడియా ప్రతినిధులు ఉద్యమసింహం సీడీలు కూడా పంచారు. కానీ ఆ సినిమా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు వర్మ అదే కాన్సెప్ట్ తో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments