కన్నకూతురిపైనే అత్యాచారం

శనివారం, 24 ఆగస్టు 2019 (18:56 IST)
పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు 5000 రూపాయల  జరిమానా విధించింది. ఈ దారుణం అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో జరిగింది. 

కసాయి తండ్రి రెండేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. 2014 లో అత్యాచారం గురించి పాప స్కూల్ టీచరుతో చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.  తల్లిని కోల్పోయిన  బాలిక  తండ్రి, సోదరుడితో కలిసి ఉంటోంది. తండ్రి రెండేళ్ల నుంచి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండగ సందర్భంగా కుమార్తెను ఇంటికి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పి ఆయన ద్వారా జిల్లా పిల్లల రక్షణ కేంద్రం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలల హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  దోషికి ఈ శిక్ష సరిపోదని, మరణ శిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యాక్షుడు అత్యుత రావు డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని తెలిపారు.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం