శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 27 జులై 2019 (19:01 IST)

వాళ్లిద్దరే నా కుమార్తెను ఓడించారు... కేశినేని నానితో జలీల్ ఖాన్

కేశినేని భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నానితో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత ఎన్నికల్లో తన కుమార్తె ఓటమికి గల కారణాలను నానికి వివరించారు జలీల్ ఖాన్.
 
ప్రచార పర్వంలోనూ, ఎన్నికల సమయంలోనూ బుద్ధా వెంకన్న మరియు నాగుల్ మీరా ఇద్దరు తన కుమార్తె గెలుపునకు పని చేయలేదని ఈ సందర్భంగా నానీ దగ్గర కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
 
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు పెంచి ప్రోత్సహించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నానికి చెప్పడం జరిగింది.