బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:21 IST)

రెండ్రోజుల్లో టీఆర్​టీ ఫలితాలు

ఎట్టకేలకు టీఆర్‌టీ, గ్రూప్​-2 ఫలితాలను ఈ నెలఖరుకల్లా విడుదల చేయాలని టీఎస్​పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో టీఆర్​టీ, గ్రూప్​-2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు అందించేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్​టీ ఎస్జీటీ తెలుగు మాధ్యమం ఫలితాలను ప్రకటించేందుకు ప్రక్రియ పూర్తిచేసింది. జాబితాను పునఃపరిశీలించి సోమవారం నాటికి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.

తొలుత గ్రూప్​-2 ఫలితాలను ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో టీఆర్​టీపై మరోసారి రీలింక్వీష్​మెంట్ తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశిలిచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఎంపిక ప్రక్రియను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు16 వరకు టీఆర్​టీ అభ్యర్థుల నుంచి రీలింక్వీష్​మెంట్​ను తీసుకుంది.

ఆపై ఆదనంగా అర్హత పొందిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించింది. వీలైనంత తర్వగా టీఆర్​టీ నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో పండుగ సెలవుల్లోనూ టీఎస్​పీఎస్సీ అధికారులు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.