Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం : ఐదుగురి దుర్మరణం

Written By వరుణ్
Updated: ఆదివారం, 13 నవంబరు 2022 (10:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపటలో ఘోరం జరిగింది. అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మునగాల పెట్రోల్ బంకు వద్ద అర్థరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సాగర్ ఎడమకాల్వ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో గత రాత్రి మహాపడి పూజ కార్యక్రమాన్ని కొందరు అయ్యప్ప భక్తులు నిర్వహించారు. ఈ పూజను విజయవంతంగా పూర్తి చేశారు. 
 
పూజ ముగించుకుని ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాలకు బయకు బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ - హైదరాబాదా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళుతుండగా, మునగాల శివారు ప్రాంతంలోని పెట్రోల్ పంపు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు గాయపడ్డారు. వీరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments